gold atm: ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నట్లు.. అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో గోల్డ్ కాయిన్స్ తీసుకోవచ్చు..!

gold sikka inaugurates gold atm in Amirpet Metro Station

  • మెట్రో స్టేషన్‌లో గోల్డ్ ఏటీఎంను ప్రారంభించిన గోల్డ్ సిక్కా లిమిటెడ్
  • గోల్డ్ ఏటీఎం నుంచి బంగారం, వెండి కాయిన్స్ తీసుకునే సౌకర్యం
  • డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ పేమెంట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు

బంగారం ప్రియులకు ఇది శుభవార్త. హైదరాబాద్‌లోని అమీర్ పేటలో గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడి మెట్రో స్టేషన్ ప్రాంగణంలో గోల్డ్ ఏటీఎంను ప్రారంభించారు. గోల్డ్ సిక్కా లిమిటెడ్ దీనిని ఏర్పాటు చేసింది. ఈ ఏటీఎం నుంచి 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అంటే ఏటీఎం నుంచి ఎలాగైతే డబ్బులు తీసుకుంటామో.... ఈ గోల్డ్ ఏటీఎం నుంచి అలాగే బంగారం, వెండి కాయిన్స్‌ను తీసుకోవచ్చు. డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా యూపీఐ పేమెంట్ చేసి బంగారం, వెండి కాయిన్స్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఏటీఎం నుంచి మనం ట్రాన్సాక్షన్ చేసిన దానికి అనుగుణంగా బంగారు కాయిన్లు బయటకు వస్తాయి. ప్రారంభమైన రోజునే ఈ గోల్డ్ ఏటీఎంకు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.

gold atm
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News