Amrit Bharat train: ఏపీ మీదుగా ప్రయాణించనున్న అమృత్‌ భారత్‌ రైలు

Amrit Bharat train will travel through Andhrapradesh

  • తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడతో పాటు పలు స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్న మాల్టా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్
  • ప్రధాని మోదీ చేతుల మీదుగా శనివారం లాంఛనంగా ప్రారంభం కానున్న సరికొత్త రైలు
  • అత్యాధునిక సౌకర్యాలతో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం

ఇండియన్ రైల్వేస్ నూతనంగా ప్రవేశపెడుతున్న ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించనుంది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్టా - కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య నడిచే రైలు ఏపీలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా వెళ్లనుంది. శనివారం నుంచి పట్టాలెక్కనున్న మాల్దా - బెంగళూరు అమృత్‌ భారత్‌ ఎక్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

కాగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అమృత్ భారత్ రైలు వలస కార్మికులకు మరింత ప్రయోజనకారిగా ఉండనుంది. ఇందులో 12 స్లీపర్‌ తరగతి, 8 జనరల్‌, 2 గార్డు బోగీలు ఉంటాయి. వందేభారత్ తరహాలో మరింత డైనమిక్‌గా దీనిని డిజైన్ చేశారు. దివ్యాంగ ప్రయాణికులకు, మహిళలకు అధునాతన సౌకర్యాలు కల్పించారు.

  • Loading...

More Telugu News