Virat Kohli: సంగక్కర రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ

Kohli breaks Sangakkara record

  • ఓ క్యాలెండర్ ఇయర్ లో 2 వేల పరుగులు ఆరు సార్లు సాధించిన సంగక్కర
  • ఏడు సార్లు 2 వేల పరుగులు చేసి కొత్త రికార్డు నెలకొల్పిన కోహ్లీ
  • దక్షిణాఫ్రికా గడ్డపై అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగుల రికార్డు కూడా కోహ్లీ సొంతం

దక్షిణాఫ్రికాతో  సెంచురియన్ టెస్టులో టీమిండియా ఓడినప్పటికీ విరాట్ కోహ్లీ ఒంటరిపోరాటం చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో 82 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అందులో 12 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. 

ఈ సందర్భంగా కోహ్లీ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార్ సంగక్కర పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. సంగక్కర ఓ సీజన్ లో 2 వేల పరుగులను 6 పర్యాయాలు సాధించాడు. ఇప్పుడా రికార్డు కోహ్లీ వశమైంది. ఇలా ఓ క్యాలెండర్ ఇయర్ లో 2 వేల పరుగులు సాధించడం కోహ్లీకి ఇది ఏడోసారి. 

సచిన్ రికార్డును అధిగమించిన కింగ్

కింగ్ కోహ్లీ అదే ఊపులో భారత బ్యాటింగ్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా అధిగమించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ గా కోహ్లీ సరికొత్త ఘనతను నమోదు చేశాడు. 

దక్షిణాఫ్రికాలో సచిన్ 38 మ్యాచ్ ల్లో 1724 పరుగులు చేయగా, కోహ్లీ ఇవాళ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా ఈ రికార్డును తెరమరుగు చేశాడు. కోహ్లీ సఫారీ గడ్డపై 29 మ్యాచ్ ల్లో 1750* పైచిలుకు పరుగులు సాధించాడు. కోహ్లీ పరుగుల్లో 5 సెంచరీలు ఉన్నాయి.

Virat Kohli
Kumar Sangakkara
Record
Sachin Tendulkar
South Africa
  • Loading...

More Telugu News