Saina Nehwal: భర్తతో కలిసి థాయ్ లాండ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న బ్యాడ్మింటన్ తార

Saina Nehwal enjoys the vacation in Thailand

  • థాయ్ లాండ్ లో పర్యటిస్తున్న సైనా నెహ్వాల్
  • సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ ను పెళ్లాడిన సైనా
  • తాజాగా, థాయ్ బీచ్ లో భర్తతో కలిసి సందడి

ఆసియా దేశం థాయ్ లాండ్ పర్యాటకులకు స్వర్గధామం వంటిది. ఇక్కడి ప్రకృతి రమణీయతకు, రుచికరమైన వంటకాలకు ఫిదా అవని వారంటూ ఉండరు. అందుకే ప్రముఖులకు థాయ్ లాండ్ ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్ గా ఉంటోంది. ఇక అసలు విషయానికొస్తే... భారత బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్ కూడా ప్రస్తుతం థాయ్ లాండ్ లో న్యూ ఇయర్ వెల్ కమ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. 

సైనా తన సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట తాజాగా థాయ్ లాండ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తోంది. ఈ విహారానికి సంబంధించిన ఫొటోలను సైనా సోషల్ మీడియాలో పంచుకుంది. భర్తతో కలిసి ఉల్లాసంగా బీచ్ లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా సైనా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

More Telugu News