Vaishnavi Chaitanya: దిల్ రాజు బ్యానర్లో 'బేబి' హీరోయిన్!

Vaishnavi in Dil Raju

  • 'బేబి' సినిమాతో వైష్ణవికి పెరిగిన క్రేజ్ 
  • వరుసగా వచ్చిపడుతున్న ఆఫర్లు 
  • ఆశిష్ జోడీగా కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ 
  • పెద్ద బ్యానర్ నుంచి ఆమెకి వచ్చిన ఫస్టు ఛాన్స్ ఇదే


ఈ ఏడాది థియేటర్లలో సందడి చేసిన సినిమాలలో .. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపించిన సినిమాలలో 'బేబి' ఒకటి. ఈ సినిమాతో వైష్ణవి చైతన్య క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. యూత్ లో ఆమె ఫాలోయింగ్ ఒక రేంజ్ కి వెళ్లిపోయింది. వరుస ఆఫర్లు ఆమె ఇంటిముందు 'క్యూ' కట్టాయి. 

అయితే వైష్ణవి తొందరపడకుండా తనకి నచ్చిన కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటోంది. అలా ఆమె ఆనంద్ దేవరకొండ జోడీగా మరో సినిమాను అంగీకరించింది. రవి నంబూరి దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమా షూటింగు జరుగుతూ ఉండగానే, వైష్ణవి మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది దిల్ రాజు సినిమా కావడం విశేషం. 

 ఆశిష్ ను దిల్ రాజు హీరోగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. హీరోగా ఆశిష్ నుంచి ఇంతవరకూ 'సెల్ఫిష్' .. 'రౌడీ బాయ్స్' వచ్చాయి. ఆయన మూడో సినిమా దిల్ రాజు బ్యానర్లో నిర్మితం కానుంది. ఈ సినిమాలో ఆయన జోడీగా వైష్ణవిని ఎంపిక చేశారు. పెద్ద బ్యానర్లో వైష్ణవి చేస్తున్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.

Vaishnavi Chaitanya
Ashish
Dil Raju
  • Loading...

More Telugu News