Gold: మరోసారి పెరిగిన బంగారం ధరలు

Gold rates hikes again

  • పైపైకి దూసుకెళుతున్న పసిడి ధరలు
  • హైదరాబాదులో 10 గ్రాముల బంగారం ధర రూ.64,250కి చేరిక
  • విజయవాడ, వైజాగ్ లోనూ 24 క్యారట్ల బంగారానికి ఇదే ధర

దేశంలో పసిడి ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాదులో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.64,250కి పెరిగింది. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,900 పలుకుతోంది. 

అదే సమయంలో... విజయవాడలో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.64,250కి చేరుకోగా, 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,900గా ఉంది. వైజాగ్ లోనూ ఇవే ధరలు ఉన్నాయి. 

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.64,400కి చేరుకోగా, 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59,050కి పెరిగింది. ముంబయిలో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.64,250 పలుకుతుండగా, 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,900గా ఉంది. కాగా, నిన్న కిలో రూ.80,700 పలికిన వెండి ధర ఇవాళ రూ.81,000కి చేరింది.

Gold
Price
24 Carrots
Hyderabad
New Delhi
Mumbai
  • Loading...

More Telugu News