Devil: 'డెవిల్' విషయంలో నిర్మాత మాట అది .. డైరెక్టర్ మాట ఇది!

Naveen Medaram Twitter Note

  • రేపు విడుదలవుతున్న 'డెవిల్'
  • దర్శక నిర్మాతల మధ్య మనస్పర్థలు
  • రెండో రోజు నుంచి  తానే డైరెక్ట్ చేశానన్న నిర్మాత 
  • మొత్తం తానే డైరెక్ట్ చేశానన్న నవీన్   


'డెవిల్' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్ రామ్ హీరోగా చేసిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి దర్శకుడిగా నవీన్ మేడారం పేరు వినిపించింది. ఆ తరువాత ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. నవీన్ ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చేయలేకపోవడం గమనించి, రెండో రోజు నుంచి తానే దర్శకత్వం వహించినట్టు నిర్మాత అభిషేక్ నామా చెప్పారు. 

అయితే నవీన్ మేడారం ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసిన 'నోట్' అందుకు భిన్నంగా ఉంది. ఈ సినిమా తన బిడ్డలాంటిదనీ .. ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు కష్టపడ్డానని అన్నాడు. 105 రోజుల పాటు ఈ సినిమా షూటింగు చేశాననీ, చిన్నచిన్న ప్యాచ్ వర్క్ మినహా మొత్తం తానే వర్క్ చేశానని చెప్పాడు. ఈగో సమస్య కారణంగా తనకి దక్కవలసిన క్రెడిట్ దక్కకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. 

ఈ విషయంపై తన మౌనాన్ని చేతకానితనం అనుకుంటున్న కారణంగా స్పందించవలసి వచ్చిందని అన్నాడు. ఎవరిపైనా లీగల్ గా చర్యలు తీసుకునే ఆలోచన తనకి లేదనీ, ప్రాజెక్టు విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు. తనకి అన్ని రకాలుగా సహకరించిన కల్యాణ్ రామ్ గారికి తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

Devil
Kalyan Ram
Abhishek Nama
Naveen Medaram
  • Loading...

More Telugu News