Ayodhya Railway Station: అయోధ్య ఆలయ ప్రారంభానికి ముందు.. రైల్వే స్టేషన్ పేరు మార్పు
- జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం
- స్టేషన్ పేరును అయోధ్య ధామ్‌గా మార్చిన ప్రభుత్వం
- ప్రాణ ప్రతిష్ఠకు 6 వేల మందికిపైగా అతిథులు
జనవరి 22న అయోధ్య రామాలయం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధామ్‌గా మార్చింది. 22న జరగనున్న అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6వేల మందికిపైగా అతిథులు హాజరుకానున్నారు.
ఈ నెల 30న ప్రధాని మోదీ అయోధ్యలో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. రోడ్ షో అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. అదే రోజు అయోధ్య రైల్వే స్టేషన్‌లో కొత్త భవనాన్ని ప్రారంభిస్తారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ భవనంలో విమానాశ్రయంలో ఉన్నటువంటి సౌకర్యాలు లభిస్తాయి. సంప్రదాయ ఆలయ ఆర్కిటెక్చర్ స్ఫూర్తితో ఈ భవనాన్ని నిర్మించారు.