Devil: 'డెవిల్' విషయంలో అదే జరిగింది: అభిషేక్ నామా

Abhishek Nama Interview

  • కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా 'డెవిల్'
  • దర్శకుడిగా మారిన అభిషేక్ నామా 
  • అనుభవం ఉండటం వల్లనే మెగాఫోన్ పట్టానని వెల్లడి 
  • ఈ నెల 29వ తేదీన విడుదలవుతున్న సినిమా


అభిషేక్ నామా నిర్మాతగా అనేక భారీ సినిమాలను నిర్మించారు. అయితే 'డెవిల్' సినిమాకి దర్శకత్వం కూడా ఆయన చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే విషయానికి సంబంధించిన ప్రశ్న ఆయనకి 'గ్రేట్ ఆంధ్ర' ఇంటర్వ్యూలో ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించారు. 

"ఈ సినిమాకి దర్శకుడిగా ముందుగా నవీన్ మేడారంను అనుకున్నాను. గతంలో అతను మా సినిమా 'బాబు బాగా బిజీ' చేశాడు. అందువలన 'డెవిల్' చేయించాలని అనుకున్నాను. కానీ ఈ సినిమా స్పాన్ పెరిగిపోయింది. దాంతో అతను హ్యాండిల్ చేయగలడా? అనే డౌట్ వచ్చింది. అందువలన నేనే మెగా ఫోన్ పట్టవలసి వచ్చింది" అని అన్నారు.

"నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయింది. చాలా ఫ్లాపులు చూశాను .. హిట్లు చూశాను. అందువలన నా సినిమా ఎలా ఉండాలనే విషయంలో నాకు ఒక అవగాహన ఉంది. అందువల్లనే డైరెక్టర్ గా మారవలసి వచ్చింది. మిగతా టీమ్ సహకారంతోనే నేను చేయగలిగాను" అని చెప్పారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 

Devil
Kalyan Ram
Samyuktha Menon
  • Loading...

More Telugu News