JN-1: అనంతపురంలో రెండు కరోనా జేఎన్-1 పాజిటివ్ కేసులు

Corona JN1 positive cases identified in Anantapur districts
  • కరోనాలో కొత్తగా జేఎన్-1 సబ్ వేరియంట్
  • పలు దేశాల్లో వ్యాపిస్తున్న జేఎన్-1
  • ఏపీలోనూ ఉనికిని చాటుకున్న కొత్త రకం
అంతర్జాతీయంగా కలకలం రేపుతున్న కరోనా సబ్ వేరియంట్ జేఎన్-1 ఏపీలోనూ ఉనికిని చాటుకుంది. అనంతపురం జిల్లాలో ఇద్దరికి కరోనా జేఎన్-1 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రోగ లక్షణాల తీవ్రత లేకపోవడంతో వారికి మందులు ఇచ్చిన వైద్యులు ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. కాగా, ఏపీలో గడచిన 24 గంటల్లో ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు గుర్తించారు. ప్రస్తుతం ఏపీలో 29 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
JN-1
Corona Virus
Sub Variant
Anantapur District
Andhra Pradesh

More Telugu News