Konda Surekha: ఎల్లుండి నుంచి దరఖాస్తులు తీసుకుంటాం: మంత్రి కొండా సురేఖ

Konda Surekha on Praja Palana

  • ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్న మంత్రి సురేఖ
  • అధికారులు విధులలో అలసత్వం వహించవద్దని సూచన
  • విపక్ష ఎమ్మెల్యేలు కూడా ప్రజాపాలనలో పాల్గొనాలన్న కొండా సురేఖ

ప్రజాపాలనలో భాగంగా ఎల్లుండి... 28వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంగళవారం ఆమె హన్మకొండలో పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. వంద రోజుల్లో వీటిని ప్రజలకు చేరువ చేస్తామని స్పష్టం చేశారు. అధికారులు విధుల్లో అలసత్వం వహించవద్దని ఆమె సూచించారు.

ఎమ్మెల్యేలు అందరూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. విపక్ష ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని సూచించారు. ఈ నెల 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ అనంతరం వాటిని పరిశీలించి అర్హులకు పథకాలను అందిస్తామన్నారు. తమలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇక నుంచి మీడియా స్వేచ్ఛగా పని చేయవచ్చునని సురేఖ అన్నారు.

Konda Surekha
Congress
Telangana
  • Loading...

More Telugu News