Vikranth: హాట్ స్టార్ కి '12th ఫెయిల్' మూవీ!

12th Fail movie update

  • అక్టోబర్ 27న విడుదలైన '12th ఫెయిల్'
  • తెలుగులో నవంబరు 3న విడుదలైన సినిమా 
  • ఈ నెల 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • నిజజీవితాల ఆధారంగా తెరకెక్కిన కథ


బాలీవుడ్ లో బయోగ్రాఫికల్ డ్రామా సినిమాలు ఎక్కువగా రూపొందుతూ ఉంటాయి. అలా నిర్మితమైన సినిమానే '12th  ఫెయిల్'. విధు వినోద్ చోప్రా దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఇది. విక్రాంత్ మాస్సే .. మేధా శంకర్ ... అనంత్ వి జోషి .. అన్షు మాన్ పుష్కర్ .. ప్రియాంశు ఛటర్జీ ప్రధానమైన పాత్రలను పోషించారు. 

అక్టోబర్ 27వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, నవంబర్ 3వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇక్కడ పబ్లిసిటీ పెద్దగా లేని కారణంగా ఈ సినిమా ఇక్కడ విడుదలైన విషయం కూడా చాలామందికి తెలియదు. ఆ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. 

ఈ నెల 29వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మనోజ్ కుమార్ శర్మ - శ్రద్ధ జోషి శర్మ తీవ్రమైన పేదరికాన్ని జయించి, తమ ఆశయ సాధనతో ఎలా ముందుకు వెళ్లారనేది ఈ సినిమా కథ. నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ తరం పిల్లలకు స్ఫూర్తిని .. ప్రేరణను కలిగించే సినిమా ఇది. 

Vikranth
Medha Shankar
Ananth
Anshuman
  • Loading...

More Telugu News