Kollu Ravindra: వంగవీటి రంగా విగ్రహ దిమ్మను తొలగించింది పేర్ని నాని తండ్రి కాదా?: కొల్లు రవీంద్ర

Kollu Ravindra fires on Perni Nani

  • రంగా వర్ధంతికి పేర్ని నాని రాజకీయ రంగు పులుముతున్నారన్న కొల్లు రవీంద్ర
  • ఒక్క రోజైనా రంగా విగ్రహానికి పూలమాల వేశారా అని ప్రశ్న
  • రంగా పేరుతో రాజకీయం చేయాలనుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్య

వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా మచిలీపట్నంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని రాజకీయ రంగు పులుముతున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో కార్యక్రమం సందర్భంగా రంగా అభిమానులు డీజేకు పర్మిషన్ అడిగితే ఇవ్వరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కొడుకు డీజేతో ఊరంతా తిరిగి రంగా విగ్రహాలకు దండలు వేస్తుంటే కనిపించలేదా అని ప్రశ్నించారు. పేర్ని నాని ఒక్క రోజైనా రంగా విగ్రహానికి పూలమాల వేశారా అని అడిగారు. రంగా మరణం తర్వాత నవకళ సెంటర్ లో ప్రస్తుతం ఉన్న రంగా విగ్రహాన్ని అడ్డుకున్నది మీ నాన్న పేర్ని కృష్ణమూర్తి కాదా? అని ప్రశ్నించారు. రంగా విగ్రహం దిమ్మను మీ తండ్రి తొలగించారని విమర్శించారు. ఈరోజు రంగా పేరుతో రాజకీయం చేయాలనుకోవడం సిగ్గు చేటని అన్నారు.

Kollu Ravindra
Telugudesam
Perni Nani
YSRCP
Vangaveeti Ranga
  • Loading...

More Telugu News