Devineni Uma: వై నాట్ పులివెందుల?: దేవినేని ఉమా

Why not Pulivendula asks Devineni Uma

  • వైనాట్ పులివెందుల అని టీడీపీ నినదిస్తోందన్న దేవినేని ఉమా
  • సింహాద్రిపురంలో చంద్రబాబు, జగన్ పర్యటనల వీడియోలను షేర్ చేసిన ఉమా
  • జగన్ వస్తే పత్తా లేని జనం అని ఎద్దేవా

ఓవైపు 'వైనాట్ 175?' అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో 'వైనాట్ పులివెందుల?' అని టీడీపీ నేతలు అంటున్నారు. తాజాగా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా స్పందిస్తూ.... వైనాట్ పులివెందుల? అంటూ టీడీపీ నినదిస్తోందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్ 2023న సింహాద్రిపురంలో చంద్రబాబు పర్యటన, అదే ఊరిలో ఈ నెలలో జరిగిన జగన్ పర్యటన వీడియోలను ఆయన షేర్ చేశారు. 'జగన్ అడ్డాలో చంద్రబాబు పర్యటనకు జన నీరాజనం. జగన్ వస్తే పత్తా లేని జనం. జగన్ పని అయిపోయింది' అని ఆయన ఎద్దేవా చేశారు.

Devineni Uma
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News