Junior NTR: ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్

Junior NTR went to Japan with his family

  • కొత్త ఏడాదిని సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన గ్లోబల్ స్టార్
  • భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలతో కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించిన యంగ్ టైగర్
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటో

ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ విరామాల్లో ఫ్యామిలీతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తుంటాడు. భార్య, పిల్లలతో కలిసి వెకేషన్స్‌కి ప్లాన్ చేస్తుంటాడు. తాజాగా ‘దేవర’ సినిమా షూటింగ్‌లో బ్రేక్ దొరకడంతో కొత్త సంవత్సరం 2024 వేడుకలను కుటుంబంతో కలిసి గ్రాండ్‌తో సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు జపాన్‌ను వేదికగా ఎంచుకున్నాడు. భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలతో కలిసి జపాన్ బయలుదేరాడు. ఇందుకు సంబంధించి ఎయిర్‌పోర్టులో భార్య, పిల్లలతో ఎన్టీఆర్ కనిపించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా తెలుగు రాష్ట్రాలతోపాటు జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

ఇదిలావుంచితే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ దేవర’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ ఈ సినిమాలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, మురళీ శర్మ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ‘దేవర’ 2 పార్టులుగా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా పార్ట్-1 ఏప్రిల్ 5, 2024న విడుదల కాబోతోంది.

Junior NTR
Japan
Devara Movie
Tollywood
Movie news

More Telugu News