Komatireddy Raj Gopal Reddy: నా పదవి పోయినా సరే...: బెల్టు దుకాణాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

Komatireddy Rajagopal Reddy on Belt Shopts

  • మునుగోడులో తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్య నాయకులతో భేటీ
  • బెల్టు షాపుల విషయంలో తాను చాలా సీరియస్‌గా ఉంటానని స్పష్టీకరణ
  • తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణవ్యాప్తంగా ఇష్టారాజ్యంగా బెల్టు దుకాణాలు పుట్టుకు వచ్చాయని.. దీంతో ఎంతోమంది యువత మద్యానికి బానిసలుగా మారిపోయారని.. కానీ ఇప్పుడు తన పదవి పోయినా సరే బెల్టు దుకాణాలు మాత్రం మూయాల్సిందేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో 26 గ్రామాల ముఖ్య నాయకులతో బెల్టు షాపుల మూసివేత, గ్రామాల అభివృద్ధిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బెల్టు షాపుల విషయంలో తాను చాలా సీరియస్‌గా ఉంటానని చెప్పారు.

తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ఎక్కడపడితే అక్కడ దొరకడం వల్ల యువత తాగుడుకు బానిసలుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. చట్ట ప్రకారం బెల్టు షాపులు ఉండకూడదన్నారు. బెల్టు షాపులను బంద్ చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ అంశం రాజకీయాలతో సంబంధం లేనిదని తేల్చి చెప్పారు. తాను మరోసారి చెబుతున్నానని.. తన పదవి పోయినా పర్వాలేదు కానీ బెల్టు షాపులు మాత్రం మూయాల్సిందే అన్నారు. ఇది గ్రామాల్లోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాల్లో బెల్టు షాపులు లేవని.. బీఆర్ఎస్ వచ్చాక విచ్చలవిడిగా తయారయ్యాయన్నారు.

Komatireddy Raj Gopal Reddy
Congress
Telangana
  • Loading...

More Telugu News