Smart Phones: 2023 లో మార్కెట్లోకి వచ్చిన బెస్ట్ ఫోన్లు
- బడ్జెట్ ఫోన్ల సెగ్మెంట్ లో ఎంఐ, రియల్ మీ, మోటో పోటీ
- ప్రీమియం ఫోన్లలో యాపిల్, శాంసంగ్, వన్ ప్లస్ దూకుడు
- మిడ్ రేంజ్ లో దాదాపు అన్ని కంపెనీల నుంచి కొత్త మోడల్ ఫోన్లు
దేశంలో 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి రావడంతో ఈ ఏడాది మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీల మధ్య పోటీ నెలకొంది. సరికొత్త ఫీచర్లతో వినియోగదారుడిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించాయి. బడ్జెట్ ఫోన్లతో పాటు ప్రీమియం సెగ్మెంట్ లోనూ మంచి మంచి ఫోన్లను కంపెనీలు విడుదల చేశాయి. ఎంఐ, రియల్ మీ, మోటో తదితర కంపెనీలు బడ్జెట్ ఫోన్లతో మార్కెట్ ను ముంచెత్తగా.. ప్రీమియం సెగ్మెంట్ లో యాపిల్, శాంసంగ్, వన్ ప్లస్ కొత్త మోడల్ ఫోన్లను తీసుకొచ్చాయి. దాదాపు అన్ని కంపెనీలు మిడ్ రేంజ్ ఫోన్లను రిలీజ్ చేశాయి. ఫోన్ ఖరీదుకు మించిన సదుపాయాలతో ఆకట్టుకున్నాయి. 5జీ, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం, కెమెరా, డిస్ ప్లే విషయంలో ఫోన్లను అత్యాధునికంగా తీర్చిదిద్దాయి. ఈ ఏడాదిలో వినియోగదారులు ఆదరించిన ఫోన్ల వివరాలు..
- వన్‌ప్లస్ నార్డ్ 3 (5జీ): రూ.30 వేలలోపు ఖరీదుతో 5జీ. ఆక్సిజన్ ఓఎస్, 50 ఎంపీ కెమెరా తదితర ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
- మోటో ఎడ్జ్ 40: 3డీ కర్వ్‌డ్ డిజైన్ తో పీఓల్‌ఈడీ డిస్‌ప్లే, 144 Hz రిఫ్రెష్ రేటు, 92.7 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో వంటి ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకత.
- పోకో ఎఫ్5: లిక్విడ్ కూల్ టెక్నాలజీ 2.0, యాడ్ ఫ్రీ ఎంఐయూఐ ఇంటర్‌ఫేస్, స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 2 ప్రాసెసర్ తదితర అత్యాధునిక ఫీచర్లు దీని సొంతం
- శాంసంగ్ ఎఫ్ 54: తక్కువ ధరలో మెరుగైన సదుపాయాలతో వచ్చిన ఫోన్ శాంసంగ్ ఎఫ్ 54. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108 ఎంపీ కెమెరాతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంది.
- రెడ్‌మీ నోట్ 12ప్రో (5జీ): 200 ఎంపీ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ ధర రూ.20 వేల లోపే..
- ఐకూ నియో 7: స్మార్ట్‌ఫోన్ గేమర్ల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఫోన్ ఇది.. 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 64 ఎంపీ OIS కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ సదుపాయాలు ఉన్న ఈ ఫోన్ ఖరీదు రూ. 30 వేల లోపే ఉండడం విశేషం.
- వన్‌ప్లస్ 11ఆర్ (5జీ): కర్వ్‌డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 1 జనరేషన్, 50ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే ఫీచర్లు ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ.
- లావా అగ్ని 2 (5జీ): రూ.20 వేల లోపు ఖరీదుతో దేశీయంగా తయారైన 5జీ ఫోన్ అగ్ని 2.. ఇందులో 6.78 అమోలెడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, 66W ఫాస్ట్ ఛార్జింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
- నథింగ్ 2: 50 50 ఎంపీ కెమెరాలు, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ తో ప్రీమియం ఫీల్ ఉన్న మీడియం రేంజ్ ఫోన్ ఇది.
- ఆనర్ 90: 200 ఎంపీ కెమెరా, 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 1.5కె స్క్రీన్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 ప్రాసెసర్ ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
- ప్రీమియం సెగ్మెంట్‌లో..
- ఐఫోన్ 15, 15 ప్రో మ్యాక్స్, వన్‌ప్లస్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఓపెన్, పిక్సెల్ 8ప్రో, ఒప్పో ఎన్ 3 ఫ్లిప్, శాంసంగ్ జడ్ ఫోల్డ్ 5, ఫ్లిప్ 5, శాంసంగ్ ఎస్23 అల్ట్రా, ఎస్23, వన్‌ప్లస్ 115జీ ఫోన్లు వినియోగదారుల ఆదరణ పొందాయి.