Bandla Ganesh: బీఆర్ఎస్ పార్టీపై బండ్ల గణేశ్ విమర్శలు

Bandla Ganesh fires on BRS

  • గత పదేళ్లలో ఏం చేశారో చెప్పాలన్న బండ్ల గణేశ్
  • పవర్ లేనోళ్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకని ప్రశ్న
  • కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పాలిస్తుందని వ్యాఖ్య

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సినీ నటుడు బండ్ల గణేశ్ సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన స్వేదపత్రంపై ఆయన స్పందిస్తూ... పవర్ లేనోళ్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకని ప్రశ్నించారు. మీరు ఏంచేశారు, ఎంత దోచుకున్నారు, ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్లారో తాము చెప్పగలమని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎంత వెనకబడ్డారో చెప్పగలమని తెలిపారు. తాము చెప్పిన విషయాలను ప్రజలు నమ్మారు కాబట్టే... కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదని... ఇంతలోనే మీకెందుకింత బాధ, భయం అని ప్రశ్నించారు. కొంత సమయం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పాలిస్తుందని చెప్పారు.

Bandla Ganesh
Congress
BRS
  • Loading...

More Telugu News