YS Sharmila: లోకేశ్ కు క్రిస్మస్ కానుకలు పంపిన షర్మిల.... ఫొటోలు ఇవిగో!

YS Sharmila sent Nara Lokesh Christmas gifts

  • రేపు క్రిస్మస్ పండుగ 
  • నారా లోకేశ్ కు ఊహించని వ్యక్తి నుంచి కానుకలు
  • ముగ్ధుడైన నారా లోకేశ్
  • షర్మిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన వైనం

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పైగా ఇది ఎవరూ ఊహించని విషయం కూడా. ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు క్రిస్మస్ కానుకలు పంపారు. "వైఎస్సార్ కుటుంబం మీకు శుభాకాంక్షలు తెలుపుతోంది... ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలి... మీకు 2024లో అంతా శుభం కలగాలి" అంటూ షర్మిల సందేశం పంపారు. 

షర్మిల కానుకలు పంపిన విషయాన్ని నారా లోకేశ్ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, ఆమె పంపిన కానుకల పట్ల హర్షాన్ని వెలిబుచ్చారు. 

"ప్రియమైన షర్మిల గారూ... మీరు పంపిన అద్భుతమైన క్రిస్మస్ కానుకలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీకు, మీ కుటుంబానికి ఈ క్రిస్మస్ తో పాటు, నూతన సంవత్సరాది కూడా సంతోషకరంగా సాగిపోవాలని నారా కుటుంబం శుభాకాంక్షలు తెలుపుతోంది" అంటూ లోకేశ్ బదులిచ్చారు.

YS Sharmila
Nara Lokesh
Gifts
Christmas
TDP
YSRCP
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News