Lasya Nandita: లిఫ్ట్ లో చిక్కుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత... డోర్లు బద్దలు కొట్టి బయటికి తీసుకువచ్చిన సిబ్బంది

BRS MLA Lasya Nandita stuck in lift

  • బోయిన్ పల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే లాస్య నందిత
  • లిఫ్ట్ ఎక్కిన వైనం
  • ఓవర్ లోడ్ తో కిందికి పడిపోయిన లిఫ్టు

సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత లాస్య నందిత ఓ కార్యక్రమానికి వెళ్లి లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. లాస్య నందిత బోయిన్ పల్లిలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె లిఫ్ట్ ఎక్కారు. అయితే, ఆ లిఫ్ట్ ఓవర్ లోడ్ కారణంగా ఒక్కసారిగా కిందికి పడిపోయింది. 

ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్ లో చిక్కుకుపోవడంతో అక్కడున్న అందరిలోనూ ఆందోళన వ్యక్తమైంది. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే సిబ్బంది అందుబాటులో ఉన్న వస్తువులతో లిఫ్ట్ డోర్లను బద్దలు కొట్టారు. దాంతో ఎమ్మెల్యే లాస్య నందిత సురక్షితంగా లిఫ్ట్ నుంచి బయటికి వచ్చారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Lasya Nandita
Lift
BRS
Contonment
Secunderabad
Telangana

More Telugu News