Corona Virus: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు... కొత్తగా 12 పాజిటివ్ కేసులు

Corona news cases in Telangana

  • గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 1,322 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 12 పాజిటివ్
  • హైదరాబాద్‌లో తొమ్మిది, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదు
  • వెల్లడించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ 

తెలంగాణలో కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 1,322 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పన్నెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో మూడింట రెండొంతులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో తొమ్మిది, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు బులెటిన్ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా నుంచి ఒకరు కోలుకోగా... 38 మంది చికిత్స తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరో ముప్పై మందికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని వెల్లడించింది.

Corona Virus
Telangana
Gandhi Hospital
  • Loading...

More Telugu News