Chiranjeevi: కంగ్రాట్స్.. దేవా ప్రభాస్: చిరంజీవి

Chiranjeevi congrats Prabhas on grand success of Salaar

  • ఘన విజయం సాధించిన ప్రభాస్ 'సలార్'
  • ప్రభాస్, సలార్, టీమ్ కు అభినందనలు తెలిపిన చిరంజీవి
  • 'సలార్' బాక్సాఫీస్ వద్ద సెగలు రేపిందన్న చిరు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్' మూవీ ఘన విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, హై టెక్నికల్ వాల్యూస్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ కు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. 

ఎక్స్ వేదికగా చిరంజీవి స్పందిస్తూ... 'మైడియర్ దేవా ప్రభాస్ కు హార్ధిక అభినందనలు. 'సలార్' బాక్సాఫీస్ వద్ద సెగలు రేపింది. అద్భుతమైన విజయం సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు అభినందనలు. ప్రపంచ నిర్మాణంలో మీరు రాణిస్తారు. పృథ్వి, శ్రుతిహాసన్, జగపతిబాబు, చిత్ర యూనిట్ భువన్ గౌడ్, రవి బస్రూర్, వీసీ చలపతి, నిర్మాత కిరగండూర్ లకు అభినందనలు' అని ట్వీట్ చేశారు. 

Chiranjeevi
Prabhas
Salaar
Prashanth Neel
Tollywood
  • Loading...

More Telugu News