AP Corona: ఏపీలో కొత్త కరోనా కేసులు.. కాసేపట్లో సీఎం జగన్ సమీక్ష

New Corona cases found in AP

  • దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు
  • ఏపీలో 3 కేసుల నమోదు
  • అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,997కి చేరుకుంది. గత 24 గంటల్లో ఏకంగా 328 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో సైతం 3 కొత్త కేసులు వెలుగు చూశాయి. అయితే ఈ కేసులు పాత వేరియంట్ వా? లేక కొత్త వేరియంట్ వా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. మరోవైపు కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయింది. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కరోనాపై సమీక్షను నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి సంబంధించి ఆయన కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. టెస్టింగ్ లను పెంచడం, ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

AP Corona
New Cases
Jagan
YSRCP
  • Loading...

More Telugu News