Telangana Corona: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు... పిల్లలపై ప్రభావం

Corona cases in Telangana increasing

  • రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
  • ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా సమాచారం
  • హైదరాబాద్ లో ఇద్దరు చిన్నారులకు కరోనా నిర్ధారణ

దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరింది. తెలంగాణలో సైతం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలు కరోనా బారిన పడ్డారు. నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో వీరికి పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నిర్ధారణ అయింది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మరో 6 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది.   

ఉమ్మడి వరంగల్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన ఒక మహిళలో కొత్త వేరియంట్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించిన డాక్టర్లు... టెస్టింగ్ కోసం పూణెలోని ల్యాబ్ కు పంపారు. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేశారు. సిద్ధిపేటలో కూడా ఒక కేసు నమోదయింది. 

కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో కొవిడ్ కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, టెస్టింగ్ సెంటర్లను పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెపుతున్నారు.

Telangana Corona
Active Cases
Children
New Cases
  • Loading...

More Telugu News