Bigg Boss: అందుకే ఆ మనీ తీసుకోలేదు: 'బిగ్ బాస్' ప్రియాంక!

Priyanka Interview

  • బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5గా నిలిచిన ప్రియాంక
  • ఎవరి నుంచి ఏమీ ఆశించలేదని వ్యాఖ్య 
  • ఆడియన్స్ నమ్మకాన్ని నిలబెట్టానని వెల్లడి 
  • పేరెంట్స్ కి ఇల్లు కొనిపెడతానని స్పష్టీకరణ


బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5లో ప్రియాంక నిలిచింది. మొదటి నుంచి కూడా ఆమె మిగతా సభ్యులకు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. చాలామంది పోటీదారులను తట్టుకుని నిలబడింది. తాజాగా గీతూ రాయల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ .. "హౌస్ లో నాకు నచ్చని విషయాలను చెబుతూ వచ్చాను .. నాకు తప్పు అనిపించింది చెబుతూ వచ్చాను" అని అంది. 

"అమర్ .. శోభ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. అందువలన వాళ్లతో కాస్త చనువుగా ఉన్నాను అంతే. నేను ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా నా శక్తి మేరకు ఆడాను. విజయానికి చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయినప్పుడు మాత్రం బాధపడేదానిని. ఈ సీజన్ లో ఎవరు గెలుస్తారు? అనే విషయంలో చివరి వరకూ మాకు ఒక క్లారిటీ రాలేదు" అని చెప్పింది. 

"టాప్ 5వరకూ రావడం గొప్ప విషయంగానే నేను భావిస్తాను. ఆ సమయంలో బిగ్ బాస్ ఆఫర్ చేసిన డబ్బును నేను తీసుకోలేదు. నాపై ఆడియన్స్ నమ్మకం పెట్టుకుని అక్కడి వరకూ తీసుకుని వచ్చారు గనుక అలా చేయాలనిపించలేదు. కష్టపడి సంపాదించి మా పేరెంట్స్ కి ఇల్లు కొనిపెడతాను. ఆ నమ్మకం నాకు ఉంది" అని  చెప్పింది. 

Bigg Boss
Priyanka
Amar
Sobha
  • Loading...

More Telugu News