Bigg Boss: బిగ్ బాస్ షోపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు

Complaint to HRC over Bigg Boss Show

  • బిగ్ బాస్ పై చాలా కాలం నుంచి వివాదాలు
  • ఇటీవల ఏడో సీజన్ ముగిశాక అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద గొడవలు
  • మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది అరుణ్
  • నాగార్జునను కూడా బాధ్యుడ్ని చేయాలని వినతి

తెలుగు బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఆది నుంచి వివాదాస్పదమవుతోంది. ఈ కార్యక్రమాన్ని నిషేధించాలంటూ చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల బిగ్ బాస్ ఏడో సీజన్ ముగిసిన తర్వాత జరిగిన ఘటనలతో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

తాజాగా, హైకోర్టు న్యాయవాది అరుణ్ బిగ్ బాస్ షో నిర్వాహకులపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ముగిసిన అనంతరం అన్నపూర్ణ స్టూడియో వెలుపల విజేత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, రన్నరప్ అమర్ దీప్ చౌదరి అభిమానుల మధ్య జరిగిన ఘర్షణను న్యాయవాది అరుణ్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. బిగ్ బాస్ నిర్వాహకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని పేర్కొన్నారు. బిగ్ బాస్ కార్యక్రమం ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. 

కాగా, అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన గొడవలపై రెండు కేసులు నమోదయ్యాయని, వాటిలో బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున పేరు ఎక్కడా లేదని, నాగార్జునను కూడా బాధ్యుడ్ని చేయాలని న్యాయవాది అరుణ్ విజ్ఞప్తి చేశారు. ఆ రోజున జరిగిన ఘర్షణల వల్ల ఎనిమిది ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయని వివరించారు. నాగార్జునపైనా కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News