David Warner: సోషల్ మీడియాలో వార్నర్ ను బ్లాక్ చేసిన సన్ రైజర్స్!

SRH blocks David Warner in social media

  • ఐపీఎల్ వేలంలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను దక్కించుకున్న సన్ రైజర్స్
  • హెడ్ కు సన్ రైజర్స్ ఖాతాలో విషెస్ చెప్పాలని ప్రయత్నించిన వార్నర్
  • అకౌంట్ ను బ్లాక్ చేసి ఉండడంతో విషెస్ చెప్పలేకపోయిన వైనం

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ను నిన్నటి ఐపీఎల్ మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ సొంతం చేసుకోవడం తెలిసిందే. వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుత శతకంతో ఆస్ట్రేలియాను విజేతగా నిలిపిన హెడ్ ను సన్ రైజర్స్ రూ.6.8 కోట్లతో కొనుగోలు చేసింది. 

అయితే, సహచర ఆటగాడు హెడ్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రయత్నించిన డేవిడ్ వార్నర్ కు నిరాశ తప్పలేదు. హెడ్ కు సన్ రైజర్స్ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విషెస్ చెప్పాలని భావించిన వార్నర్ విఫలమయ్యాడు. అందుకు కారణం... వార్నర్ ను సన్ రైజర్స్ ఫ్రాంచైజీ గతంలో బ్లాక్ చేసి ఉండడమే. 

అప్పట్లో వార్నర్ కు, సన్ రైజర్స్ యాజమాన్యానికి మధ్య విభేదాలు ఏర్పడినట్టు ప్రచారం జరిగింది. 2016 ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ ను చాంపియన్ గా నిలిపిన వార్నర్... ఆ తర్వాత అనుకోని రీతిలో కెప్టెన్సీ కోల్పోయాడు. ఓ దశలో తుది జట్టులో స్థానం కూడా లభించక రిజర్వ్ బెంచ్ పై కూర్చోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కు వెళ్లిపోయాడు. అప్పటినుంచి వార్నర్ కు, సన్ రైజర్స్ కు మధ్య సత్సంబంధాలు లేవు. 

వార్నర్ ను సోషల్ మీడియాలో సన్ రైజర్స్ బ్లాక్ చేసిన సంగతి నిన్న జరిగిన పరిణామంతో వెల్లడైంది. తన ఖాతాను సన్ రైజర్స్ యాజమాన్యం బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్లను వార్నర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

David Warner
SRH
Social Media
IPL
  • Loading...

More Telugu News