Carona: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Carona Cases Increasing In India

  • కొత్తగా 341 మందికి వైరస్ పాజిటివ్
  • ఒక్క కేరళలోనే 292 మందికి కరోనా
  • వైరస్ తో ముగ్గురు చనిపోయారని ప్రభుత్వ ప్రకటన
  • తెలంగాణలో నాలుగు కేసులు

దేశంలో మరోసారి కరోనా కలకలం రేగుతోంది. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 341 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో కేరళలో అత్యధికంగా 292 మందికి వైరస్ సోకింది. ప్రపంచవ్యాప్తంగా కలవరం సృష్టిస్తున్న కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 భారత్ లోకి ఎంటరైంది. ఈ నెల 8న కేరళలో తొలి కేసు నమోదు కాగా.. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కరోనా బారిన పడి కేరళలో ముగ్గురు చనిపోయారని ఆరోగ్య శాఖ ప్రకటించింది.

తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో నలుగురికి వైరస్ సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య తొమ్మిదికి చేరిందని తెలిపింది. తమిళనాడులో 13 మంది, మహారాష్ట్రలో 11 మంది, కర్ణాటకలో 9 మంది, పుదుచ్చేరిలో నలుగురు కరోనా బారిన పడ్డారు. దేశంలోని మిగతా రాష్ట్రాలలో పది పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా, కరోనా కొత్త సబ్ వేరియంట్ గుర్తించడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అలర్ట్ చేసింది. మరికాసేపట్లో హైలెవల్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Carona
COVID19
Virus cases
Increasing India
Kerala

More Telugu News