Shabbir Ali: పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతాం: షబ్బీర్ అలీ

We will win parliament elections also says Shabbir Ali
  • తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్
  • ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్న షబ్బీర్ అలీ
  • ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటామని వ్యాఖ్య
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా పార్టీ కీలక నేతలు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టేలా కార్యాచరణను ప్రారంభించారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ... వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని తెలిపారు. ఆరు గ్యారెంటీలను ఎట్టి పరిస్థితుల్లోనైనా అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటామని తెలిపారు. ఇదే సమష్టి కృషితో పని చేసి, పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Shabbir Ali
Congress

More Telugu News