mallu ravi: ఎంపీల సస్పెన్షన్‌‌పై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ నేత మల్లు రవి

Mallu ravi fires at MPs suspenstion from parliament

  • 78 మంది ఎంపీలను ఒకేరోజు సస్పెండ్ చేయడం పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి అని ఆగ్రహం
  • ఆగంతుకులు పార్లమెంట్‌లోకి వెళ్లడం దేశ చరిత్రలో దారుణ సంఘటన అని వ్యాఖ్య
  • పార్లమెంట్ భద్రతపై చర్చకు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్న

పార్లమెంట్‌లో ఎంపీల సస్పెన్షన్‌పై టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... 78 మంది ఎంపీలను ఒకేరోజు సస్పెండ్ చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ అన్నారు. ఆగంతుకులు పార్లమెంట్‌లోకి వెళ్లడం దేశ చరిత్రలో దారుణమైన సంఘటన అన్నారు. ఇంకేమైనా ప్రమాదం కలిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? అని ఆందోళన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ భద్రతపై చర్చించేందుకు అధికార పక్షం ఎందుకు భయపడుతోంది? అని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు. వికసిత్ భారత్ అంటే ఇదేనా? బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాలని దుయ్యబట్టారు. పార్లమెంట్‌పై ముష్కరుల దాడి జరిగిన రోజే ఈ ఘటన జరగడం భద్రత వైఫల్యమే అన్నారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలి.. ప్రజలందరికీ అన్ని విషయాలు తెలియాలన్నారు.

mallu ravi
Congress
Telangana
Parliament
  • Loading...

More Telugu News