Team India: టీమిండియాతో రెండో వన్డే... టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా

Team India loses toss again

  • టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల వన్డే సిరీస్
  • కెబెరాలో నేడు రెండో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • వన్డే జట్టులోకి అరంగేట్రం చేసిన రింకూ సింగ్

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. మూడు వన్డేల ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించడం తెలిసిందే. నేటి మ్యాచ్ లోనూ గెలిస్తే సిరీస్ టీమిండియా వశమవుతుంది. ఈ రెండో వన్డేకు కెబెరాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. 

శ్రేయాస్ అయ్యర్ టెస్టు జట్టులోకి వెళ్లడంతో అతడి స్థానంలో టీమిండియాలో రింకూ సింగ్ ను తీసుకున్నారు. రింకూ సింగ్ కు అంతర్జాతీయ కెరీర్ లో ఇదే తొలి వన్డే. దక్షిణాఫ్రికా జట్టులో ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు జరిగాయి. బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాద్ విలియమ్స్ జట్టులోకి వచ్చారు.

Team India
Toss
South Africa
2nd ODI

More Telugu News