: సురేష్ కల్మాడీని ప్రశ్నించనున్న సీబీఐ
కామన్ వెల్త్ గేమ్స్ వ్యవహారంలో భారత ఒలింపిక్ కమిటీ ఛైర్మన్ సురేష్ కల్మాడీని సీబీఐ ప్రశ్నించనుంది. ఈ వారంలోనే కల్మాడీకి సీబీఐ నోటీసు పంపనుందని సమాచారం. 2010లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ కోసం 'ఈవెంట్ నాలెడ్జ్ సిస్టమ్స్' సంస్థ 70 కోట్ల విలువచేసే మూడు కాంట్రాక్టుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో ఏమాత్రం నిబంధనలు పాటించడంలేదని ఆరోపణలు వచ్చాయి. దాంతో వెంటనే పరిశోధన మొదలుపెట్టిన సీబీఐ పలువురిని విచారిస్తూ వస్తోంది. ఈ క్రమంలో గత సంవత్సరం కల్మాడీ, పలువురు సీనియర్ అధికారులపై సీబీఐ కేసు కూడా నమోదు చేసింది. కాగా, కామన్ వెల్త్ గేమ్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్మాడీ కొన్ని రోజులు జైల్లోనూ ఉన్నారు.