Toby: డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన మూవీ 'టోబి' .. సోనీలివ్ లో!

Toby OTT release date confirmed

  • కన్నడలో ఇటీవల విడుదలైన 'టోబి'
  • రాజ్ బి.శెట్టి నటనకు దక్కిన ప్రశంసలు
  • దర్శకత్వం వహించిన బాసిల్  
  • ఈ నెల 22 నుంచి జరగనున్న స్ట్రీమింగ్


కన్నడలో ఈ మధ్య కాలంలో వచ్చిన వైవిధ్యభరితమైన సినిమాలలో 'టోబి' ఒకటిగా కనిపిస్తుంది. రాజ్ బి.శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకి, బాసిల్ దర్శకత్వం వహించాడు. రాజ్ బి. శెట్టి ఎంచుకునే కథలు .. పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయనే సంగతి, ఆయన గత చిత్రాలను చూస్తే అర్థమైపోతుంది. ఈ సినిమాలోను ఆయన డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడు. 

ఈ సినిమాలో చైత్ర ఆచార్ .. రాజ్ దీపక్ శెట్టి .. గోపాల్ దేశ్ పాండే .. సంయుక్త ముఖ్యమైన పాత్రలను పోషించారు. కొత్తగా అనిపించే కథాకథనాలతో  రూపొందిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమాను సోనీలివ్ వారు ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు.

 రవి రాయ్ నిర్మించిన ఈ సినిమాకి మిథున్ ముకుందన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో హీరో బాల్యమంతా ఎంతో అసంతృప్తిగా గడుస్తుంది. అతణ్ణి చేరదీసినవారు పెట్టిన పేరే 'టోబి'. అతనిలో ఆవేశం ఎక్కువ. కొంతమంది తమ ప్రయోజనాల కోసం అతణ్ణి వాడుకుంటూ ఉంటారు. అది గ్రహించిన 'టోబి' ఏం చేస్తాడు?' అనేదే కథ. 

Toby
Raj B. Shetty
Samyukta Hornad
Chaithra J. Achar
  • Loading...

More Telugu News