CM Revanth: ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Telangana CM Revanth Reddy Delhi Tour

  • సీఎంగా రేవంత్ కు ఇది రెండో టూర్
  • పార్టీ చీఫ్ ఖర్గేతో పాటు సోనియా, రాహుల్ ను కలవనున్న సీఎం
  • ప్రధానంగా క్యాబినెట్ విస్తరణపైనే చర్చ జరగనున్నట్లు సమాచారం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండయ్యారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండోసారి ఢిల్లీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను సీఎం రేవంత్ కలుసుకోనున్నారు. పార్టీలోని ఇతర సీనియర్ నేతలతోనూ రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.

ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ క్యాబినెట్ విస్తరణపైనే చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. సోమవారం హైదరాబాద్ లో జరిగిన పీఏసీ సమావేశంలోనూ ఇదే అంశంపై చర్చ జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ చర్చల సారాంశాన్ని పార్టీ హైకమాండ్ కు నివేదించి, క్యాబినెట్ లోకి ఎవరెవరిని తీసుకోవాలనే విషయంపై రేవంత్ రెడ్డి సూచనలు స్వీకరిస్తారు. తెలంగాణ కేబినెట్ లో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహా మొత్తం 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి అవకాశం ఉండగా.. ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఉమ్మడి పది జిల్లాల్లో నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. ఈ విషయంపై అధిష్ఠానంతో రేవంత్ చర్చించనున్నారు.

CM Revanth
Delhi Tour
cabinet expansion
Minister posts
Congress
High commond
Kharge
Sonia Gandhi
  • Loading...

More Telugu News