Telangana Inter Exams: ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు?

Telangana Inter exams to start from February 28
  • లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పరీక్షల నిర్వహణ
  • ఇప్పటికే పరీక్షల నిర్వహణపై రేవంత్ రెడ్డి సమీక్ష
  • విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని సూచన
తెలంగాణలో ఇంటర్ పరీక్షలను ఫిబ్రవరి 28 నుంచి నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పరీక్షల నిర్వహణ తేదీలకు సంబంధించి ప్రభుత్వానికి తాజాగా ప్రపోజల్ పంపినట్టు సమాచారం. త్వరలోనే లోక్ సభ ఎన్నికల హడావుడి ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఇంటర్, పదో తరగతి పరీక్షలను ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. 

మరోవైపు, ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు, ఇంటర్ పరీక్షలు బుధవారం నాడు ప్రారంభం కావడం ఎప్పటి నుంచో ఒక సెంటిమెంట్ గా వస్తోంది. ఫిబ్రవరి 28వ తేదీ కూడా బుధవారం కావడం గమనార్హం. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ విడుదల కానుంది.
Telangana Inter Exams
Date
Revanth Reddy
Congress
10th Exams

More Telugu News