Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లో శివాజీ .. ప్రశాంత్ బలం అదే: అర్జున్

Arjun Interview

  • బిగ్ బాస్ హౌస్ లో తన మార్క్ చూపించిన అర్జున్ 
  • సోలో ఆటతీరునే కనబరుస్తూ వచ్చిన తీరు
  • తాను ఎవరినీ టార్గెట్ చేయలేదని వెల్లడి 
  • తనతో శివాజీ గొడవపడలేదని వివరణ   


బిగ్ బాస్ హౌస్ లో నిలకడగా ఉంటూ .. సోలోగా ఆడుతూ వెళ్లిన అర్జున్, తనకంటూ కొంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు. టాప్ 6లో కనిపిస్తూ వచ్చిన ఆయన, ఫినాలేలో బయటికి వచ్చేశాడు. తాజా ఇంటర్వ్యూలో అర్జున్ మాట్లాడుతూ .. "నేను బయట ఎలాగైతే ఉన్నానో .. లోపల కూడా అలాగే ఉన్నాను" అన్నాడు. 

"నేను సేఫ్ గేమ్ ఆడలేదు .. ఎవరినీ టార్గెట్ కూడా చేయలేదు. సోలోగానే ఆడుతూ వెళ్లాను. హౌస్ లో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటే, కొన్ని సందర్భాల్లో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి వస్తుంది. అందుకే నా ఆట నేను ఆడుతూ వెళ్లాను. నేను ఎవరి విషయంలో జోక్యం చేసుకోలేదు .. నా జోలికి వస్తే వదిలిపెట్టలేదు. నామినేషన్స్ లో మాత్రమే నా అభిప్రాయం చెప్పాను.   

శివాజీ నాతో ఎప్పుడూ గొడవపడలేదు. అలాంటి సందర్భం వస్తుందనుకున్నానుగాని రాలేదు. యావర్ ఆవేశం అతని బలం .. శివాజీకి మేధస్సు బలం .. ప్రశాంత్ కి అతని గేమ్ .. ఏడవడం అతని బలం. అతను సింపతీ కోసం ఏడ్చాడా అనేది చెప్పలేను. హౌస్ లో ప్రతీదీ ఒక గేమ్ .. దానిని తప్పు అని చెప్పడానికి లేదు" అని చెప్పాడు. 

Bigg Boss
Arjun
Shivaji
Pallavi Prashanth
  • Loading...

More Telugu News