CTScan: సీటీస్కాన్‌తో యమ డేంజర్.. చిన్నారులు, యువతలో బ్లడ్ కేన్సర్ ముప్పు

CT scans linked to higher risk of blood cancers in children and young people

  • యూరోపియన్ పీడియాట్రిక్ సీటీ అధ్యయనంలో వెల్లడి
  • అధ్యయనం నిర్వహించిన బార్సెలోనాలోని పోంప్యూ ఫాబ్రా యూనివర్సిటీ బృందం
  • సీటీస్కాన్‌లోని ఎక్స్ కిరణాల రేడియేషన్‌తో పెను ముప్పు

అనారోగ్యం బారినపడి ఆసుపత్రికి వెళ్తే చాలా వైద్యులు వెంటనే సీటీస్కాన్ రాసేస్తూ ఉంటారు. ఈ స్కాన్ ద్వారా రోగానికి కారణమయ్యే అసలు విషయాన్ని గుర్తించి సరైన చికిత్స అందించవచ్చనేది వైద్యుల భావన. సీటీస్కాన్ అనేది ప్రస్తుతం చాలా సర్వసాధారణమైన విషయం. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం గురించి తెలిస్తే మాత్రం సీటీస్కాన్ చేయించుకోవడానికి భయపడతారు. 

సీటీస్కాన్ వల్ల చిన్నారులు, యువత బ్లడ్ కేన్సర్ బారినపడే అవకాశం ఉందని యూరోపియన్ పీడియాట్రిక్ సీటీ (ఈపీఐ-సీటీ) అధ్యయనం హెచ్చరించింది. దాదాపు 10 లక్షలమందిని అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. స్పష్టమైన ఇమేజీల కోసం సీటీస్కాన్‌లో ఉపయోగించే ఎక్స్ కిరణాలు యువతను ముప్పులోకి నెట్టేస్తున్నాయని పేర్కొంది. బార్సెలోనాలోని పోంప్యూ ఫాబ్రా యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆందోళనకర విషయం వెలుగుచూసింది. సీటీస్కాన్ రేడియేషన్ కారణంగా రక్త కేన్సర్లు అయిన లింఫోయిడ్, మయోలిడ్ ముప్పు అధికంగా ఉందని అధ్యయనం తేల్చింది.

  • Loading...

More Telugu News