Dola Balaveeranjaneyulu: ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచినా ఏం ఉపయోగం?: టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయులు

Dola Balaveeranjaneyulu fires on Jagan

  • నాలుగున్నరేళ్లు ప్రజారోగ్యాన్ని జగన్ గాలికి వదిలేశారన్న బాలవీరాంజనేయులు
  • నెట్ వర్క్ ఆసుపత్రులకు వెయ్యి కోట్లు బకాయిలు ఉన్నాయని విమర్శ
  • ఎన్నికల ముందు కొత్త డ్రామాకు తెరతీశారని మండిపాటు

ఏపీలో ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితిని రూ. 25 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. ప్రతి పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయులు స్పందిస్తూ... నాలుగున్నరేళ్లు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన జగన్... ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. 

ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ లోని ఆసుపత్రులకు రూ. వెయ్యి కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని.... ఆ బకాయిలను చెల్లించకుండానే ఎన్నికల ముందు మరో డ్రామాకు జగన్ తెరతీశారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యమే అందనప్పుడు... దాని పరిమితిని రూ. 25 లక్షలకు పెంచితే ఏం ఉపయోగం? రూ. కోటికి పెంచితే ఏం ఉపయోగం? అని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News