South Central Railway: దక్షిణమధ్య రైల్వే కీలక ప్రకటన.. ఎనిమిది రైళ్ల రద్దు

South Central Railway key announcement on Trains cancelled

  • హసన్‌పర్తి-ఉప్పల్‌ రైల్వేస్టేషన్ల మధ్య పనుల కారణంగా 8 రైళ్ల రద్దు
  • కాజీపేట-హసన్‌పర్తి, బళ్లార్ష-కాజీపేట మధ్య డిసెంబర్ 19 నుంచి జనవరి 13 వరకు నిలిచిపోయిన సర్వీసులు
  • రైళ్ల వివరాలను ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే

దక్షిణమధ్య రైల్వే సోమవారం కీలక ప్రకటన చేసింది. హసన్‌పర్తి-ఉప్పల్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే పనుల కారణంగా డిసెంబరు 19 నుంచి జనవరి 13 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. మొత్తం 8 రైళ్లు రద్దు కానున్నాయని, కనిష్ఠంగా 12 రోజుల నుంచి గరిష్ఠంగా 26 రోజులపాటు ఈ రైళ్లు అందుబాటులో ఉండబోవని తెలిపింది. రైళ్ల వివరాలను వెల్లడించింది.

కాజీపేట-హసన్‌పర్తి, బళ్లార్ష-కాజీపేట, కరీంనగర్‌-సిర్పూర్‌, సిర్పూర్‌-కరీంనగర్‌ రైళ్లు డిసెంబరు 19 నుంచి జనవరి 13 వరకు నడవబోవని ప్రకటనలో దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ రైళ్లు జనవరి 2 నుంచి 13 వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఇక కరీంనగర్‌-బోధన్‌ రైలు డిసెంబరు 19 నుంచి జనవరి 13 వరకు, బోధన్‌-కరీంనగర్‌ రైలు డిసెంబరు 20 నుంచి జనవరి 14 వరకు రద్దు కానున్నట్టు వెల్లడించింది.

  • Loading...

More Telugu News