Nara Lokesh: నారా లోకేశ్ యువగళం చివరి రోజు... ఇలా సాగింది!

- నేటితో ముగిసిన నారా లోకేశ్ యువగళం
- మొత్తం 226 రోజుల పాటు సాగిన పాదయాత్ర
- చివరి రోజున గ్రేటర్ విశాఖ పరిధిలో భారీ ర్యాలీ
- గాజువాక శివాజీనగర్ లో పైలాన్ ఆవిష్కరించిన లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగిసింది. చివరి రోజున లోకేశ్ గ్రేటర్ విశాఖ పరిధిలో పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా టీడీపీ శ్రేణులతో పాటు మిత్రపక్షమైన జనసేన శ్రేణులు కూడా విశాఖకు భారీగా తరలివచ్చాయి.
కుటుంబ సభ్యులు, వేలాదిమంది కార్యకర్తలు, అభిమానులు వెంట రాగా... భారీ ర్యాలీగా గాజువాక శివాజీనగర్ తరలి వెళ్లిన నారా లోకేశ్ అక్కడ పైలాన్ ను ఆవిష్కరించారు. గతంలో చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ఎక్కడైతే ముగించారో అక్కడే యువగళం పాదయాత్రను కూడా ముగించారు.
ఈ ఉదయం సీబ్ల్యూసీ-1 నుంచి ప్రారంభమైన పాదయాత్ర కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ ఉత్సాహంగా సాగింది. 226వ రోజు పాదయాత్రలో లోకేశ్ తో కలిసి తల్లి నారా భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరా దేవి, ఇతర కుటుంబసభ్యులు అడుగులు వేశారు.
ముగింపు కార్యక్రమంలో తల్లి నారా భువనేశ్వరి, నందమూరి వసుంధరాదేవి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, ఉభయగోదావరి జిల్లాల సమన్వయ కర్త ప్రత్తిపాటి పుల్లారావు, భరత్, మాజీమంత్రులు కొల్లు రవీంద్ర, అమర్ నాథ్ రెడ్డి, టీడీ జనార్దన్, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రి కోండ్రు మురళి, గాజువాక ఇన్ చార్జి పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాబు, జ్యోతుల నవీన్, తదితరులు పాల్గొన్నారు.
బీసీలు బ్యాక్ బోన్ అంటూనే వెన్నువిరుస్తావా సైకో జగన్?
ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైకోఇజానికి బలైన ఓ బీసీ నాయకుడి భవనం. గ్రేటర్ విశాఖ గాజువాక సెంటర్లో అన్ని అనుమతులు, నిబంధనల మేరకే టీడీపీ సీనియర్ నేత, బీసీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు తమ సొంత స్థలంలో భవనాన్ని నిర్మించుకున్నారు. శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నాడని కక్షగట్టిన సైకో జగన్... 2020లో ఆయన నిర్మించుకున్న భవనాన్ని కుంటిసాకులతో కూల్చివేశారు.
బీసీలు బ్యాక్ బోన్ అంటూ వేదికపై లెక్చర్లు ఇస్తున్న జగన్... నాలుగున్నరేళ్ల పాలనలో అడుగడుగునా బీసీలపై అణచివేత చర్యలకు పాల్పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్... వారిపైనే ఉక్కుపాదం మోపుతూ రాక్షసానందం పొందుతున్నాడు. నియంతపాలనకు సాక్షీభూతంగా నిలుస్తున్న ఈ శిథిలాలతోనే బీసీలంతా కలిసి నీ అరాచక ప్రభుత్వానికి పాడె కట్టడం ఖాయం... రాసిపెట్టుకో జగన్మోహన్ రెడ్డీ!
యువగళం విజయవంతంలో కీలకపాత్ర వహించిన వివిధ కమిటీల సారథులు వీరే...
1. యువగళం మెయిన్ కోఆర్డినేటర్ – కిలారు రాజేశ్.
2. వ్యక్తిగత సహాయక బృందం – తాతా నరేష్, కుంచనపల్లి వినయ్, పిన్నింటి మూర్తి.
3. వాలంటీర్స్ కమిటీ – అనిమిని రవినాయుడు, మానం ప్రణవ్ గోపాల్.
4. ఫుడ్ కమిటీ – మద్దిపట్ల సూర్యప్రకాష్, లక్ష్మీపతి.
5. మీడియా కమిటీ – మెయిన్ కో-ఆర్డినేటర్ బి.వి.వెంకటరాముడు, కాసరనేని జశ్వంత్.
6. పబ్లిక్ రిలేషన్స్ కమిటీ – కృష్ణారావు, కిషోర్, మునీంద్ర, చల్లా మధుసూధన్ రావు ఫోటోగ్రాఫర్స్: సంతోష్, శ్రీనివాస్, కాశీప్రసాద్.
7. అలంకరణ కమిటీ – బ్రహ్మం చౌదరి, మలిశెట్టి వెంకటేష్.
8. అడ్వాన్స్ టీమ్ కమిటీ – డూండీ రాకేష్, నిమ్మగడ్డ చైతన్య, శ్రీరంగం నవీన్ కుమార్, చంద్రశేఖర్, నారాయణస్వామి, కోలా రంజిత్ కుమార్, ప్రత్తిపాటి శ్రీనివాస్.
9. రూట్ కోఆర్డినేషన్ కమిటీ – కస్తూరి కోటేశ్వరరావు (కె.కె), కర్నాటి అమర్నాథ్ రెడ్డి.
10. కరపత్రాల పంపిణీ కమిటీ – అడుసుమిల్లి విజయ్, వెంకటప్ప, వంశీ, చీరాల నరేష్, యార్లగడ్డ మనోజ్.
11. సెల్ఫీ కోఆర్డినేషన్ కమిటీ – వెల్లంపల్లి సూర్య, శ్రీధర్ చౌదరి, ప్రదీప్.
12. వసతుల కమిటీ – జంగాల వెంకటేష్, నారా ప్రశాంత్, లీలాధర్, బాబి, రమేష్.
13. తాగునీటి వసతి కమిటీ – భాస్కర్, చిరుమాళ్ల వెంకట్, అనిల్.
14. సోషల్ మీడియా - అర్జున్







