KTR: పెళ్లి రోజు... 20 ఏళ్ల క్రితం నాటి పెళ్లి ఫొటోను షేర్ చేసిన కేటీఆర్

KTR shares 20 years back marriage photo

  • సోషల్ మీడియా వేదికగా భార్య శైలిమకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
  • రెండు దశాబ్దాలుగా తనకు మద్దతుగా నిలిస్తోందన్న కేటీఆర్
  • తమ ప్రయాణం ఇలాగే కలకాలం కొనసాగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన భార్య శైలిమకు సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సాయంత్రం ట్వీట్ చేశారు. నా ప్రియమైన భార్యకు 20వ వివాహ వార్షిక శుభాకాంక్షలు... ఈ రెండు దశాబ్దాలుగా తనకు మద్దతుగా నిలిచినందుకు... తనకు ఇద్దరు అందమైన పిల్లలను అందించినందుకు... అలాగే ఈ ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా ఉన్నందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈ ప్రయాణం ఇలాగే కలకాలం కొనసాగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 20 ఏళ్ల క్రితం నాటి పెళ్లి ఫొటోను, తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసిన మరో ఫొటోను షేర్ చేశారు.

  • Loading...

More Telugu News