Nara Lokesh: మరికొద్దిసేపట్లో యువగళం ముగింపు ఘట్టం... లోకేశ్ ర్యాలీకి భారీ స్పందన

Nara Lokesh Yuvagalam comes to an end

  • యువగళం పాదయాత్రకు నేటితో ముగింపు
  • విశాఖ శివాజీ నగర్ వద్ద పైలాన్ ఆవిష్కరించనున్న లోకేశ్ 
  • లోకేశ్ తో కలిసి ర్యాలీలో పాల్గొన్న కుటుంబ సభ్యులు


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. 

ముగింపు కార్యక్రమంలో భాగంగా... గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి లోకేశ్ ర్యాలీ ప్రారంభించగా, సంఘీభావంగా వేలాది మంది ప్రజలు లోకేశ్ ను అనుసరించారు. 

లోకేశ్ తో కలసి తల్లి నారా భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరా దేవి, ఇతర కుటుంబసభ్యులు కూడా ముగింపు ర్యాలీలో పాల్గొన్నారు. మరికొద్దిసేపట్లో శివాజీనగర్ వద్ద యువగళం ముగింపు సందర్భంగా లోకేశ్ పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. 

లోకేశ్ ర్యాలీ నేపథ్యంలో గాజువాక ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది. లోకేశ్ తో కలసి నడిచేందుకు యువతీయువకులు, మహిళలు పోటీ పడ్డారు. యువగళం ముగింపు కార్యక్రమం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నేతలు, జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీ ర్యాలీ కారణంగా గాజువాక ప్రధాన రహదారిపై 2 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయింది.

Nara Lokesh
Yuva Galam Padayatra
Visakhapatnam
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News