Salaar: 'సలార్' రిలీజ్ ట్రైలర్ ఇదిగో... ప్రభాస్ క్యారెక్టర్ పై మరింత క్లారిటీ

Prabhas starring Salaar release version trailer out now

  • ప్రభాస్ హీరోగా సలార్: సీజ్ ఫైర్
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్ట్రా యాక్షన్ మూవీ
  • నేడు థియేట్రికల్ ట్రైలర్ విడుదల
  • ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పాన్ ఇండియా చిత్రం

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సలార్: సీజ్ ఫైర్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్రబృందం ఎట్టకేలకు విడుదల చేసింది. 'ఖాన్సార్' అనే కాల్పనిక నగరం నేపథ్యంలో సలార్ మొదటి పార్ట్ ఉంటుంది.

ఈ చిత్రం నుంచి వచ్చిన అప్ డేట్లు చూసినప్పుడే వయొలెన్స్ పీక్స్ లో ఉంటుందన్న విషయం అర్థమైంది. సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కేజీఎఫ్, కేజీఎఫ్-2 చూసినవారికి ఇదేమీ కొత్త అనిపించదు కానీ, సలార్ లో ఉన్నది ప్రభాస్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 

ఇప్పుడీ రిలీజ్ వెర్షన్ ట్రైలర్ చూస్తే ప్రభాస్ క్యారెక్టర్ విషయంలో మరికాస్త స్పష్టత వచ్చింది. ప్రభాస్ ఇందులో ఓ మెకానిక్ గా కనిపించనున్నారు. రెంచీలు తిప్పడమే కాదు, తుపాకీ కాల్చడం, పదునైన కత్తులతో విరుచుకుపడడం కూడా తనకు తెలుసని చాటారు.

ట్రైలర్ చివర్లో ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఇద్దరు ప్రాణస్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఖాన్సార్ కథను మార్చింది అంటూ వాయిస్ ఓవర్ తో చెప్పించారు. దాంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగేలా చేశారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రుతిహాసన్ జంటగా సలార్: సీజ్ ఫైర్ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 22న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సలార్ మొదటి పార్టుకు A సర్టిఫికెట్ ఇచ్చారు. 

ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, టినూ ఆనంద్, ఈశ్వరీరావు, శ్రియా రెడ్డి, గరుడ రామ్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. 

Salaar
Release Trailer
Prabhas
Prashanth Neel
Hombale Films

More Telugu News