Yogibabu: యోగిబాబు హీరోగా 'కుయికో' .. నెట్ ఫ్లిక్స్ లో!

Kuiko movie update

  • యోగిబాబు ప్రధాన పాత్రగా రూపొందిన 'కుయికో'
  • నవంబర్ 24న థియేటర్స్ కి వచ్చిన సినిమా 
  • ఈ నెల 22 నుంచి జరగనున్న స్ట్రీమింగ్ 
  • కామెడీ ప్రధానంగా నడిచే కంటెంట్


తమిళంలో యోగిబాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన ప్రధాన పాత్రగా కూడా అడపాదడపా సినిమాలు వస్తున్నాయి. అలా రీసెంటుగా ఆయన నుంచి వచ్చిన సినిమానే 'కుయికో'. అరుళ్ చెజియాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నవంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
 
కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమా, ఈ నెల 22వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. యోగిబాబుతో పాటు విదార్థ్ .. శ్రీ ప్రియాంక ... ఇళవరసు .. వినోదిని వైద్యనాథన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమిళనాట ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. ఆంటోని దాసన్ సంగీతం ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. 

కథ ప్రకారం హీరో సౌదీ అరేబియాలో ఒంటెలను పెంచే వ్యక్తిగా కనిపిస్తాడు. ఇక్కడ గ్రామంలోని అతని తల్లి చనిపోతుంది. తాను వచ్చేవరకూ ఆమె శవాన్ని ఫ్రీజర్ బాక్సులో పెట్టమని బంధువులకు చెబుతాడతను. ఆ తరువాత వచ్చిన అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో చూడాలి మరి.

Yogibabu
Vidharth
Arul
  • Loading...

More Telugu News