Jagan: ప్రతీ ఇంటా ఈ రెండు యాప్లు ఉండాలి: సీఎం జగన్
- ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ ఉండాలనేదే తమ లక్ష్యమన్న సీఎం
- ఈరోజు నుంచి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని వెల్లడి
- 1.4 కోట్ల మందిని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చామని వ్యాఖ్య
పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఒక వరమని... ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేసేందుకే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పేదవాడికి ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నామని... వైద్య ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతున్నామని తెలిపారు.