Nara Lokesh: యువగళం ముగింపు సందర్భంగా విశాఖలో నారా, నందమూరి కుటుంబాలు

Family members attended Nara Lokesh padayatra

  • నేటితో ముగుస్తున్న లోకేశ్ యువగళం   
  • లోకేశ్ తో పాటు నడిచిన కుటుంబ సభ్యులు
  • ఈ నెల 20న యువగళం విజయోత్సవ సభ

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చివరి రోజుకు చేరుకుంది. చివరి రోజు యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యాత్ర చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. జనసేన శ్రేణులు కూడా లోకేశ్ తో కలిసి నడుస్తున్నాయి. మరోవైపు పాదయాత్ర ముగుస్తుండటంతో నారా, నందమూరి కుటుంబ సభ్యులు విశాఖకు చేరుకున్నారు. లోకేశ్ వెంట తల్లి నారా భువనేశ్వరి, అత్త వసుంధర, ఇతర కుటుంబ సభ్యులు కలిసి నడిచారు. ఈ ఏడాది జనవరి 27న పాదయాత్ర ప్రారంభమయింది. మొత్తం 97 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగింది. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభను టీడీపీ పెద్ద ఎత్తున నిర్వహించబోతోంది. 

Nara Lokesh
Telugudesam
Family
  • Loading...

More Telugu News