Bigg Boss Telugu Season 6: అందుకే టీవీల్లో కనిపించడం లేదు: శ్రీసత్య

Sri Sathya Interview

  • బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించిన శ్రీసత్య 
  • ఆ సీజన్ కి ఆమెనే ప్రత్యేకమైన ఆకర్షణ 
  • ఈ మధ్య స్మాల్ స్క్రీన్ పై కనిపించని శ్రీసత్య 
  • సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెట్టానని వెల్లడి  


'బిగ్ బాస్' సీజన్ 6లో లుక్ పరంగా .. యాక్టివ్ గా ఉండటం పరంగా శ్రీ సత్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో చికెన్ కావాలంటూ ఆమె చేసిన అల్లరి ప్రేక్షకులకు ఇంకా గుర్తుంది.  ఆ తరువాత శ్రీసత్య కొన్ని టీవీ షోస్ లో సందడి చేసింది. ఈ మధ్య కాలంలో మాత్రం, ఆమె టీవీల్లో కనిపించడం లేదు. 

తాజా ఇంటర్వ్యూలో శ్రీ సత్య మాట్లాడుతూ .. " గతంలో నేను సీరియల్స్ లో చేశాను .. అలాగే టీవీ షోస్ లో కనిపించాను. కానీ ఆ తరువాత ఇక సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నాను. అందువలన కొంతకాలం పాటు బుల్లితెరకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుని, సినిమా అవకాశాలపైనే దృష్టి పెట్టాను" అని అంది. 

"ఈ మధ్య కాలంలో నేను సినిమాలతో కాస్త బిజీగా ఉన్నాను. 'డీజే టిల్లు 2'లో ఉన్నాను. రీసెంటుగా ఆ షూటింగు పూర్తయింది. త్వరలో ఒక సినిమా షూటింగు కారణంగా అమెరికా వెళ్లబోతున్నాను. వేరే ప్రాజెక్టులపై సైన్ చేసి ఉన్నాను. కొత్తగా కథలు కూడా వింటున్నాను. నన్ను నేను పెద్ద స్క్రీన్ పై చూసుకోవాలని అనుకుంటున్నాను .. అందుకే పూర్తి ఫోకస్ అటు వైపే పెట్టాను" అని చెప్పింది.

Bigg Boss Telugu Season 6
Sri Sathya
Actress
  • Loading...

More Telugu News