TOEFL: టోఫెల్‌ పరీక్షలో త్వరలో కీలక మార్పులు

Toefl exam to be more personalized

  • అభ్యర్థుల అవసరాలు, నేపథ్యానికి అనుగుణంగా ఉండనున్న పరీక్ష
  • అభ్యర్థులు చేయబోయే కోర్సులకు తగినట్టు మార్పులు
  • టోఫెల్‌లో పక్షపాత ధోరణులు నిర్మూలించేందుకు మార్పులకు శ్రీకారం
  • మీడియాకు వెల్లడించిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ ఉపాధ్యక్షుడు

పైచదువుల కోసం విదేశాలకు వెళ్లే వారు రాసే ఆంగ్ల భాష పరీక్ష టోఫెల్‌లో కీలక మార్పులు రానున్నాయి. ఇకపై పరీక్ష రాసే అభ్యర్థుల వ్యక్తిగత అవసరాలు, నేపథ్యానికి అనుగుణంగా పరీక్ష పేపర్‌ను సిద్ధం చేస్తామని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ సీనియర్ ఉపాధ్యక్షుడు రోహిత్ శర్మ తాజాగా మీడియాకు తెలిపారు. ఉదాహరణకు జర్మనీ, భారత్ విద్యార్థులకు వారి పూర్వాపరాలకు అనుగుణంగా వేర్వేరు పరీక్ష పేపర్లు ఉంటాయని వివరించారు. అభ్యర్థి చదవబోయే కోర్సుకు అనుగుణంగా కూడా మార్పులు ఉంటాయని వివరించారు. పరీక్షలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు.

TOEFL
Study Abroad
Personalised Test
  • Loading...

More Telugu News