Pushpa Fame Jagadish: యువతి ఆత్మహత్య కేసు... నేరాన్ని అంగీకరించిన 'పుష్ప' నటుడు 

Pushpa fame Jagadish now in Chanchalguda prison

  • గత నెల 29న యువతి ఆత్మహత్య
  • నటుడు జగదీశ్ కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి తండ్రి
  • డిసెంబరు 6న జగదీశ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

ఓ యువతి ఆత్మహత్య కేసులో 'పుష్ప' ఫేమ్ జగదీశ్ (బండారు ప్రతాప్) ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. గతంలో ఓ యువతిని ప్రేమించిన జగదీశ్ కొన్నాళ్లు ఆమెతో కలిసి ఉన్నాడు. అయితే, 'పుష్ప' చిత్రంతో ఒక్కసారిగా పేరు రావడంతో జగదీశ్ ప్రవర్తనలో మార్పు గమనించిన సదరు యువతి... మరో యువకుడికి దగ్గరైంది. ఈ పరిణామాన్ని భరించలేకపోయిన జగదీశ్... ఆమెపై కోపం పెంచుకున్నాడు. 

ఒక రోజు ఆమె నివాసం వద్దకు వెళ్లగా, అక్కడ మరో యువకుడితో ఆమె సన్నిహితంగా ఉన్న దృశ్యాలను ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ విజువల్స్ ను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడంతో ఆ యువతి భయపడి నవంబరు 29న ఆత్మహత్యకు పాల్పడింది. 

నటుడు జగదీశ్ కారణంగానే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. జగదీశ్ ను డిసెంబరు 6న అరెస్ట్ చేశారు. జగదీశ్ ను పంజాగుట్ట పోలీసులు రెండ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసు విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు. కస్టడీ ముగియడంతో తిరిగి అతడిని చంచల్ గూడ జైలుకు తరలించారు. 

గతంలో  తనతో కలిసి ఉన్న యువతి మరొకరికి దగ్గర కావడంతో భరించలేకపోయానని జగదీశ్ పోలీసులకు వెల్లడించాడు. ఆమెను తన దారికి తెచ్చుకోవడానికే ఫొటోలతో బెదిరించినట్టు ఒప్పుకున్నాడు.

More Telugu News