Manchu Manoj: తండ్రి కాబోతున్న నటుడు మంచు మనోజ్

Manchu Manoj becomes father

  • ప్రేమించి పెళ్లి చేసుకున్న మంచు మనోజ్, భూమా నాగ మౌనిక 
  • ఈ ఏడాది మార్చిలో వివాహం
  • శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా శుభవార్త చెప్పిన మనోజ్

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఇరువైపులా కుటుంబ పెద్దల సమ్మతితో వారి వివాహం జరిగింది. మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్ శుభవార్త చెప్పారు. త్వరలో తాను తండ్రిని కాబోతున్నానని వెల్లడించారు. ఇది తమకు ఎంతో సంతోషకర సమయం అని, అందరూ తమ ఆశీస్సులు అందించాలని కోరారు. ఈ మేరకు మంచు మనోజ్ ట్వీట్ చేశారు. 

"అత్తమ్మ శోభా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా... ఈ సంతోషకరమైన వార్తను అందరితో పంచుకుంటున్నా. అత్తమ్మా... నువ్వు, భూమా నాగిరెడ్డి మామ మరోసారి అమ్మమ్మ, తాతయ్యలు అయ్యారు. మా చిన్నారి ధైరవ్ అన్న కాబోతున్నాడు. నాకు తెలుసు... పైనుంచి మీరు మీ ఆశీస్సులను మాకు అందిస్తూ, మా కుటుంబం ఎదుగుదలను అనుక్షణం పరిరక్షిస్తూ, మీ అశేష ప్రేమను మాపై కురిపిస్తూ ఉంటారు. మా అమ్మ నిర్మల, మా నాన్న మోహన్ బాబుల ఆశీస్సులతో, కుటుంబ సభ్యులం అందరి ప్రేమాభిమానాలతో ముగ్ధులమవుతున్నాం" అంటూ  మంచు మనోజ్ తన ట్వీట్ లో వివరించారు. 

చాలాకాలం పాటు  సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ పెళ్లి తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. అటు సినిమా, ఇటు బుల్లితెర షోతో బిజీ అయ్యారు. వాట్ ద ఫిష్ అనే సినిమా చేస్తున్న మంచు మనోజ్... ఉస్తాద్ అనే టీవీ షో కూడా చేస్తున్నారు.

Manchu Manoj
Fatherhood
Bhuma Naga Mounika
Shobha Nagireddy
Bhuma Nagireddy
  • Loading...

More Telugu News